ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి

28-11-2026 | 11:17pm

- ఎమ్మెల్యే కవ్వంపల్లి

- ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలి

- అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

- 75 మంది లబ్ధిదారులకు చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత

బెజ్జంకి, నవంబర్ 28: గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలపై ప్రతి గ్రామ సర్పంచ్‌తో పాటు మండల స్థాయి అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. శనివారం బెజ్జంకి మండల(Bejjanki Mandal) కేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ(MLA K Satyanarayana) పాల్గొనీ మాట్లాడుతూ  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై(welfare schemes and development programs) ప్రజలకు పూర్తి సమాచారం అందించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల ఫలాలు చేరేలా చూడాలని అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలుపై కొందరు అధికారులు సరైన అవగాహనతో వ్యవహరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖల వారీగా ఇప్పటివరకు చేపట్టిన పనులు, ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరుతడి పంటల సాగుపై చర్చించారు. అనంతరం 75 మంది లబ్ధిదారులకు వివిధ పథకాల చెక్కులతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.

సమావేశంలో పలువురు గ్రామాల సర్పంచ్‌లు మండల అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సర్పంచ్‌లకు తగిన సహకారం అందించడం లేదని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులకు అధికారులు సహకరించి గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ దామోదర్, ఏఎంసీ చైర్మన్ శిరీష, ప్రత్యేక అధికారి విజయ్ భార్గవ, ఎంపీడీవో ప్రవీణ్, పర్శ సంతోష్,లింగాల శ్రీనివాస్, కత్తి రమేష్, రావుల నర్సయ్య, వివిధ గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు