ఆర్టీసీ కండక్టర్ కు ఆర్థిక సహాయం
సూర్యాపేట, నవంబర్ 28 (విజయక్రాంతి) : ఇటీవల రోడ్డు ప్రమాదంలో(Road accident) గాయపడిన సూర్యాపేట డిపోకు(Suryapet Depot) చెందిన కండక్టర్ కు సూర్యాపేట ఆర్టీసీ సిబ్బందితమ వంతు ఆర్థిక సహాయం(Financial assistance) చేసి మానవత్వం చాటుకున్నారు. సూర్యాపేట డిపోలో కండక్టర్ గా విధులునిర్వహిస్తున్న నాగులపాడు అన్నారం కు చెందిన లోకేశ్వరి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైంది. విషయం తెలుసుకున్న ఆర్టీసీ సిబ్బంది తమ వంతుగా 65000( సూర్యాపేట డిపో సిబ్బంది 60000 నార్కెట్ పల్లి డిపో సిబ్బంది 5000 ) సేకరించగా శనివారం ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ బి.సైదులు ఆర్టీసీ సిబ్బందితో కలిసి లోకేశ్వరి ఇంటి వద్దకు వెళ్లి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బందికి ప్రతి ఒక్కరూ అండగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టిసి నాయకులు సుంకరి శ్రీనివాస్, బత్తుల సుధాకర్ మాచర్ల భాస్కర్ భాను నాయక్ డిఆర్ కుమార్ ఏ వెంకన్న ఉప్పు లక్ష్మయ్య, కే సరిత ఎన్ లక్ష్మి ఆర్ స్వరూప తదితరులు పాల్గొన్నారు.