రైతు సంక్షేమం, ఆధునిక సాగుకు ప్రభుత్వం ప్రాధాన్యం
ఆది శ్రీనివాస్
తంగళ్ళపల్లి నవంబర్28 (విజయ క్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల వ్యవసాయ కళాశాలలో రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Adi Srinivas) అన్నారు. శనివారం జిల్లెల్ల వ్యవసాయ కళాశాలలో(Jillella Agricultural College) వ్యవసాయ, ఆత్మ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళాను కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితెతో కలిసి ప్రారంభించారు. రైతులు ఆధునిక సాగు పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటలు చేపట్టి అధిక ఆదాయం పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఆదర్శ రైతులను సన్మానించి వివిధ శాఖల స్టాళ్లను సందర్శించారు.