టీచర్లపై నిందారోపణలా?

04-11-2026 | 05:00am

డా. ఎస్ విజయభాస్కర్ :

తెలంగాణ ఉపాధ్యాయులపై(Telangana Teachers Association) నిందారోపణలు ఆందోళనకరమైన విష యం. పలు ప్రైమరీ, హైస్కూళ్లలో(Primary and high schools) వాచ్‌మెన్‌లు, ఆయాలు, తరగతికి ఒక ఉపాధ్యాయుడు, స్కావెంజర్ లేక, కనీసం నీటి వసతి కూడా లేక ఎన్నో ఇబ్బందులెదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్న నిధులు సకాలంలో అందక టీచర్లు, హెచ్‌ఎంలు సొంత డబ్బలు ఖర్చుపెడ్తున్నారు. మోరీలు నిండిపోతే, బోరింగ్‌లు చెడిపోతే, చాక్‌పీస్‌లు అయిపోతే, ఫ్యాన్‌లు చెడిపోతే జీఎస్టీ బిల్లులు చెల్లించాలనడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం ప్రతి సంవత్సరం గ్రాంట్లను మం జూరు చేస్తుంది.

స్టేషనరీ, పారిశుద్ధ్య పనులు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోళ్లకు వచ్చే గ్రాంట్స్ పాఠశాల అవసరాలకు ఏమాత్రం సరిపోవ డం లేదని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. ఆ గ్రాంట్స్ కూడా ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. మాస్టార్లే ప్రతినెలా తమ జీతాల నుండి కొంత డబ్బును పాఠశాల అవసరాలకు వినియోగిస్తున్నారు.

ఆయా, వాచ్‌మన్, చాక్‌పీస్‌లు, మార్క ర్ పెన్నులు, ఇతరత్రా స్టేషనరీకి వెచ్చిస్తున్నారు.  దేశంలో ఏ మాత్రం అవినీతి, అక్రమాలకు తావులేని డిపార్ట్‌మెంట్ ఉపాధ్యాయులదే. అయితే, కొంతమంది పాఠశాల నిధులు దుర్వినియోగమవుతున్నాయని, హెచ్‌ఎం లు, ఉపాధ్యాయులు  ప్రభుత్వ గ్రాంట్స్‌ను వారి సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని విమర్శలు చేయడం శోచనీయం.

టెన్త్ విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో స్పెషల్ క్లాస్‌లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సాయంత్రం పిల్లల కోసం పండ్లు, రిఫ్రెష్ మెంట్‌లను ఉపాధ్యాయులు తమ సొంత డబ్బుతో అందిస్తున్నారు.  ఇంత చేసినా పరీక్షలలో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించినా అటు ప్రభుత్వం, ఇటు తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ప్రోత్సాహం, గుర్తిం పు లభించకపోవడం విచారించదగిన విషయం.

వేతన జీవుల తిప్పలు:-

రాష్ట్రంలో ఉపాధ్యాయులకు వేతనాలు పెరిగాయని, డీఏలు మంజూరు అయ్యాయంటున్నారు. కానీ ప్రతి సంవత్సరం ఇన్‌కం టాక్స్ రూపంలో 30 శాతం జీతం ప్రభుత్వానికి కట్టాలి. 12 నెలలు కష్టపడితే ఉపాధ్యాయులకు పది లేదా పదకొండు నెలల జీతం మాత్రమే మిగులుతుంది. 

ఈఎల్స్‌లో అన్యాయం:-

అన్ని శాఖల ఉద్యోగులకు 30 రోజుల ఈఎల్స్ ఇస్తారు. పొలీసులకు 45 రోజులిస్తారు. కానీ ఉపాధ్యాయులకు వెకేషన్ డిపార్ట్‌మెంట్ అంటూ కేవలం ఆరు ఈఎల్స్ మాత్రమే ఇస్తున్నారు. వేసవి సెలవులు విద్యార్థులకు మాత్రమే ఉంటాయి. ఉపాధ్యాయులకు పదవ తరగతి వాల్యూయే షన్ డ్యూటీ,  ఓపెన్ స్కూల్ పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు, వాటి వాల్యూయేషన్, ఇన్‌సర్వీస్ టీచర్లకు వేసవిలో శిక్షణ తరగతులు ఈ విధంగా ఏదో ఒక డ్యూటీ తప్పకుండా ఉంటుంది.

ఈ క్రమంలో ఉపాధ్యాయులను కూడా నాన్‌వెకేషన్ డిపార్ట్‌మెంట్ కింద పరిగణించాలని అన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఇక విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి రేయింబవళ్ళు కష్టపడుతున్న ఉపాధ్యాయుల శ్రమను ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. అనవసరంగా ఉపాధ్యాయులపై నిందారోపణలు ఆపాలని సమాజం లో ఉపాధ్యాయులపై ఉన్న గౌరవాన్ని, భక్తిని, త్యాగాలను తగ్గించకుండా సమాజం లో ఉపాధ్యాయుల పరువు, ప్రతిష్ట లు పెంపొందించడానికి ప్రతి ఒక్కరు తొడ్పాటు అందించాలని కోరుతున్నారు.

సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అనేది కేవలం జీవనోపాధి కోసం కాదు అన్ని వృత్తుల నిపుణులను తయారు చేసే గౌరవించదగిన, ఆదర్శనీయమైన సమాజసేవ అనే విషయాన్ని ఉపాధ్యాయులపై నిందారోపణలు చేసే వారు అర్థం చేసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

వ్యాసకర్త: టీఆర్‌టీఎఫ్ ప్రధాన కార్యదర్శి, 9290826988

మరిన్ని వార్తలు