బిజెపి నాయకుల హౌస్ అరెస్ట్

14-11-2026 | 04:34pm

హనుమకొండ,(విజయక్రాంతి):హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ(Congress party) నిర్వహిస్తున్న సదస్సును నిరసిస్తూ బీజేపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో, హన్మకొండలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే కాంటెస్టెడ్ కాండిడేట్ రావు పద్మ రెడ్డి(BJP leaders Rao Padma Reddy)ని పోలీసులు హౌస్ అరెస్ట్(House Arrest) చేశారు. ఈ సందర్భంగా రావు పద్మ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రతిపక్షాల నిరసనలను అడ్డుకోవడమేనా తెలంగాణ కాంగ్రెస్ చెబుతున్న ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించారు.

"ఒకవైపు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడుతారు. మరోవైపు తెలంగాణలో బీజేపీ నాయకులు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు" అని ఆమె విమర్శించారు. హౌస్ అరెస్టులతోనో, అక్రమ నిర్బంధాలతోనో బీజేపీ పోరాటాన్ని ఆపలేరని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి అని ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డిని కూడ సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

మరిన్ని వార్తలు