మాలలకు న్యాయం చేయాలి..
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మాల యువజన సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం
మల్లాపూర్, నవంబర్ 03 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో(Telangana State) అమలవుతున్న రోస్టర్ పాయింట్ల విధానాన్ని సవరించి మాలలకు న్యాయం చేయాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మాల యువజన సంఘాల(Ambedkar Mala Youth Associations) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మల్లాపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మాల యువజన సంఘాల నాయకులు మల్లాపూర్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో రోస్టర్ పాయింట్ల విధానాన్ని అమలు చేయడం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. రోస్టర్ పాయింట్లలో మాలలకు 22వ పాయింట్ కేటాయించడం వల్ల ప్రభుత్వం ఇటీవల భర్తీ చేసిన ఉద్యోగాల్లో మాలలకు ఒక్క ఉద్యోగం కూడా దక్కని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత రోస్టర్ విధానాన్ని పునఃసమీక్షించి మాలలకు కేటాయించిన రోస్టర్ పాయింట్లలో రెండు పాయింట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై మరోసారి సమగ్రంగా ఆలోచించి మాలలకు న్యాయం చేయాలని కోరారు. రోస్టర్ పాయింట్లలో సవరణ జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇందులో భాగంగా మెట్పల్లి పాత తాలూకా పరిధిలోని వివిధ మండలాల తహసీల్దారులకు విడతల వారీగా వినతిపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే నవంబర్ 15న కోరుట్ల పట్టణంలో భారీ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మెట్పల్లి పాత తాలూకా పరిధిలోని అన్ని గ్రామాల మాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎల్క కమలాకర్, బక్కూరి చింతామణి, వుడుగుల గంగాధర్, కొంపల్లి రాజు, ఉయ్యాల లక్ష్మణ్, అచ్చ చిన్న రాజం, దామెర ప్రశాంత్, బడే బాలు, రోస్టర్ పాయింట్ల సవరణ సాధన కమిటీ మెట్పల్లి పాత తాలూకా నాయకులు బలిజ రాజారెడ్డి, ఉయ్యాల నరసయ్య, ఉయ్యాల శోభన్, బద్ది మురళి, బడే లక్ష్మణ్, బన్న రాజేష్, గురుమంతుల నారాయణ, దామ రాజేష్, మ్యాదరి లక్ష్మణ్, రాజేష్, బండ వంశీ, బలిజ సంతోష్, తూర్పు రాజన్న, కోడిపెల్లి రాజేందర్, మద్దెల స్వామి, నరేష్, మద్దెల శ్రీనివాస్‌తో పాటు మండలంలోని వివిధ గ్రామాల మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.