దళిత మహిళలను అవమానించిన ఆర్డీవోను సస్పెండ్ చేయాలి
జగిత్యాల, నవంబర్ 04 (విజయక్రాంతి): దళిత మహిళలను అవమానించిన ఆర్డిఓను వెంటనే సస్పెండ్ చేయాలని అంబేద్కర్ సంఘం(Ambedkar Association) నాయకులు మహిళలు జగిత్యాల ఆర్డిఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. పెగడపల్లి మండల పరిధిలోని లాగలమర్రి గ్రామానికి చెందిన దళితులు భూ సమస్యను పరిష్కరించాలని ఆర్డిఓకి వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళితే మహిళలని చూడకుండా వ్యంగ్యంగా మాట్లాడుతూ మీ 50 కుటుంబాల ఇళ్ళను కూలగొడతామని ఆర్డిఓ అవమానించి బెదిరించారని మహిళలు ఆరోపించారు.
ల్యాగలమర్రి గ్రామ శివారులోని 6వ సర్వే నెంబర్ లోని ప్రభుత్వ ఆట స్థలంలో అక్రమంగా ఇల్లు నిర్మాణం చేపడుతున్నా వారికి ఆర్డీవో అండగా నిలుస్తూ దళిత మహిళలను అవమానించడం చాలా బాధాకరం అన్నారు. గత సంవత్సరన్నర కాలం నుండి గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని ఉన్నతాధికారులు పరిశీలించి న్యాయం చేయాలని కోరితే కనీసం పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా ఉన్నత అధికారులు ల్యాగలమర్రి గ్రామాన్ని సందర్శించి భూ సమస్యను పరిష్కరించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని దళితులు వేడుకుంటున్నారు.