కలెక్టరేట్‌లో పిల్లల ‘ప్రజావాణి’

16-11-2026 | 05:24pm

పిల్లల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు

జగిత్యాల, నవంబర్ 16 ( విజయ క్రాంతి ): బాలల హక్కుల వారోత్సవాలను(Children's Rights Week) పురస్కరించుకొని ఈరోజు సోమవారం (16 నవంబర్) జగిత్యాల కలెక్టరేట్‌లోని ప్రజావాణి ప్రాంగణంలో పిల్లల కోసం ప్రత్యేకంగా పిల్లల ప్రజావాణి’ హెల్ప్ డెస్క్(‘Praja Vani’ Help Desk) ఏర్పాటు చేశారు.

తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ హెల్ప్ డెస్క్ నిర్వహిస్తున్నారు. పిల్లల హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు, బాల్య వివాహ నిరోధక చట్టం - 2006, పొక్సో చట్టం - 2012 పై కూడా ఈ సందర్భంగా అవగాహన కల్పించడం జరిగింది.

ఏదైనా సమస్య ఉంటే చైల్డ్ హెల్ప్ లైన్ - 1098 కు కాల్ చేయాలని పిల్లలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా విద్య వైద్య ఆరోగ్యశాఖ, కార్మిక శాఖ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు