వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
జిల్లా కలెక్టర్‌ను కోరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల, నవంబర్ 09 ( విజయక్రాంతి ) : జగిత్యాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో(Jagtial Integrated Collectorate Office) జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్(District Collector B. Satya Prasad) ని వారి ఛాంబర్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్(Jagtial MLA Dr. Sanjay Kumar) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వానాకాలం వరి పంట(Rainy season rice crop) కోత దశకు చేరుకుందని, జగిత్యాల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించే క్రమంలో మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.
దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, సంబంధిత అధికారులతో మాట్లాడి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.