ప్రజావాణిలో 15 ఫిర్యాదులు స్వీకరించిన పోలీస్ కమిషనర్
ఫిర్యాదుదారుల సమస్యలను చట్టప్రకారం పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు
బోధన్,నవంబర్ 09 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో(Nizamabad District Police Headquarters) సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో(Public Grievances) పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య(Police Commissioner P. Sai Chaitanya) ఐపీఎస్ ప్రజల నుంచి 15 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో(complainants) నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు సమర్పించిన అర్జీలను పరిశీలించిన పోలీస్ కమిషనర్, ఆయా సమస్యలను చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచించారు. ఫిర్యాదుల తక్షణ పరిష్కారానికి సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సీఐలతో ఫోన్లో మాట్లాడి సమస్యల వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి భయం, పైరవీలు, మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను స్వచ్ఛందంగా పోలీసుల దృష్టికి తీసుకువచ్చి చట్టపరంగా పరిష్కారం పొందేలా పోలీస్ శాఖ కృషి చేస్తోందన్నారు.
పోలీసులు ప్రజలకు మరింత చేరువ కావడం, ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపడం, జిల్లాలో శాంతిభద్రతలను సమర్థవంతంగా పరిరక్షించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజా సమస్యలపై నేరుగా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.