వైభవంగా సదర్ సంబరాలు

09-11-2026 | 07:26pm

ఘట్ కేసర్, నవంబర్ 9  (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలో(Ghatkesar town) ఆదివారం రాత్రి సదర్ ఉత్సవం వైభవంగా జరిగింది. ఘట్ కేసర్ యాదవ సంఘం(Ghatkesar Yadav Association) అధ్యక్షుడు మామిళ్ల మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి రాజబోయిన రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సదర్ ఉత్సవంలో(Sadar Festival) ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మామిండ్ల ముత్యాల్ యాదవ్, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముల్లి జంగయ్యయాదవ్, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు మారం లక్ష్మారెడ్డి, సీఐ కిరణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాలో యాదవులకు సంబంధించిన పాటలతో హోరెత్తించారు. దీపావళి పండుగ సందర్భంగా యాదవులు కుల పండుగగా భావించే సదర్  లో యాదవుల కుల దైవం అయిన శ్రీకృష్ణ భగవానుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దున్నపోతుల విద్యాసాలు ప్రదర్శించారు. ముఖ్య అతిథులు ఘట్ కేసర్ పట్టణ యాదవులకు సదర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. యాదవ సోదరులు సదర్ పండుగ విన్యాసాల కోసం వారి అత్యుత్తమ మగ గేదెలను ప్రదర్శించడానికి ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని ఉపయోగించు కుంటుంది.

గేదెలను నూనెతో మెరుస్తూ, వాటి కొమ్ములు, శరీరానికి రంగులు వేయడం, మెడ చుట్టూ దండలు, వాటి పాదాలకు చీలమండలు (గజ్జలు), మెడ లేదా నుదుటి పై గంటలతో సీషెల్ బ్యాండ్లు, వాటి కొమ్ము లపై నెమలి ఈకలతో అలంకరించబడి ఉంటాయి అలా వాటిని చూడటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈకార్యక్రమంలో ఘట్ కేసర్ పట్టణ యాదవ సంఘం సభ్యులు, యాదవులు, పట్టణ ప్రజలు, నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు