నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

09-11-2026 | 07:32pm

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..

లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పాయం

బూర్గంపాడు,(విజయక్రాంతి): అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల(government welfare schemes) ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ ఛైర్మన్ పాయం వెంకటేశ్వర్లు(Payam Venkateswarlu) అన్నారు. బూర్గంపాడు మండల కేంద్రంలోని రైతు వేదికలో టేకులచెరువు గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు(Indiramma housing allotment documents), కల్యాణలక్ష్మి పథకం చెక్కుల పంపిణీ(Distribution of Kalyana Lakshmi scheme cheques) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులను గుర్తించి ఇళ్లను మంజూరు చేయడంతో పాటు, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సాయం అందిస్తోందని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ అర్హులందరికీ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో ఎంపీడీవో జమలారెడ్డి, తహసీల్దార్ ప్రసాద్, హౌసింగ్ ఏఈ ఉదయ్ కిరణ్, మండల అధ్యక్షుడు పి. సుధాకర్ రెడ్డి, జిల్లా అధికారి ప్రతినిధి పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, టేకుల చెరువు సర్పంచ్ సైదమ్మ , సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు