అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నాం

09-11-2026 | 07:30pm

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు 

లక్షేట్టిపేట, నవంబర్ 9 ( విజయక్రాంతి ): అభివృద్ధి, సంక్షేమమే(Development and welfare) ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(Mancherial MLA Prem Sagar Rao) అన్నారు. సోమవారం మండలంలోని వెంకట్రావ్ పేట్ పాఠశాల(Venkatrao Pet School) ఆవరణలో సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను(CM Relief Fund, Kalyana Lakshmi, Shaadi Mubarak cheques) లబ్ధిదారులకు స్థానిక నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) హయాంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజా పాలన కొనసాగుతుందని తెలిపారు.

పేదలు, మధ్య తరగతి ప్రజలకు అండగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగించే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైన కూడా ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల పథకాలు అందిస్తుందని వివరించారు. అంతేకాకుండా విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పక్షాల అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు.

ప్రజలు కాంగ్రెస్ పాలనలో సంతోషంగా ఉన్నారని, ప్రజా పాలనకే ప్రజల మద్ధతు ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో  సింగిల్ విండో చైర్మన్ నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు,సర్పంచులు నలిమేల రాజు, దుమ్మని సత్తన్న, గొడిసేల రాజేశం,పట్టణ అధ్యక్షులు షాహిద్ అలీ,నాయకులు దొంత నర్సయ్య,గడ్డం త్రిమూర్తి,శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి,కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు