కరీంనగర్ నుండి అరుణాచలంకి సూపర్ లగ్జరీ బస్సు

09-11-2026 | 07:08pm

ముకరంపుర, నవంబర్ 9 (విజయక్రాంతి): కరీంనగర్ నుండి అరుణాచలం(From Karimnagar to Arunachalam) కు తీర్థయాత్ర బస్సు బయలు దేరుతుందని కరీంనగర్ వన్ డిపో మేనేజర్ విజయ మాధురి(Karimnagar One Depot Manager Vijaya Madhuri) తెలియజేశారు. తీర్థ యాత్ర ల టూర్ లో భాగం గా నవంబర్ నెలలో కరీంనగర్ 1 డిపో సూపర్ లగ్జరీ బస్సు  ఈనెల 13 న కరీంనగర్ బస్టాండ్ నుండి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి 14 వ తేదీ కాణిపాకం,కంచి (2 టెంపుల్స్) దర్శనం తదుపరి ఇదే రోజు రాత్రి అరుణాచలం చేరి,గిరి ప్రదక్షిణ, దర్శనం తదుపరి అరుణాచలం నుండి 15 నవంబర్, మధ్యాహ్నం బయలుదేరి మరుసటి రోజు జోగులాంబ దర్శనం, అనగా 16 నవంబర్ సోమవారం సాయంత్రం వరకు కరీంనగర్ చేరుతుందని,ఇట్టి బస్సు పెద్దలకు రూ. 5000 .. పిల్లలకు రూ.3750 ..గా నిర్ణయించబడినది అని తెలిపారు.భోజనం మరియు ఇతర ఖర్చులు ప్రయాణికులవే.మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి 7382849352, 9959225920..

మరిన్ని వార్తలు