20 లక్షల ప్రమాద భీమా పట్ల హర్షంవ్యక్తం చేసిన ఆశాలు
మోతె, నవంబర్ 09 (విజయక్రాంతి):- తెలంగాణ రాష్ట్రంలోని ఆశా కార్యకర్తలకు(ASHA workers) రూ.20 లక్షల ప్రమాద భీమా(Accident Insurance) సౌకర్యం కల్పించడంతో పాటు, 6 నెలల ప్రసూతి సెలవులు మంజూరు(Granting of maternity leave) చేసేందుకు అధ్యక్షులు మైముద తో జరిగిన చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఆశా కార్యకర్తల సంఘం కోశాధికారి కళమ్మ హర్షం వ్యక్తం చేశారు.
నేడు స్థానిక సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ఆశా కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిరక్షణ కోసం నిరంతరం సేవలందిస్తూ, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వారి సేవలను గుర్తించి ప్రమాద భీమా, ప్రసూతి సెలవుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినదన్నారు.
అదేవిధంగా ఆశా కార్యకర్తల దీర్ఘకాలిక డిమాండ్లైన నెలకు రూ.18,000 గౌరవ వేతనం పెంపు మరియు రూ.10 లక్షల ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించే అంశాలపై కూడా ప్రభుత్వం త్వరితగతిన సానుకూల నిర్ణయం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.ఆశా కార్యకర్తల ఆర్థిక, ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించేలా డిమాండ్ల సాధనకు కృషి చేసిన ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ కి సమావేశం కృతజ్ఞతలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు స్వాతి, జానకమ్మ తదితరులు పాల్గొన్నారు.