ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

15-11-2026 | 06:09pm

జగిత్యాల, నవంబర్ 15 (విజయక్రాంతి): జగిత్యాల పట్టణంలోని గీత విద్యాలయం పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్(MLA Dr. Sanjay Kumar) ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈరోజుల్లో ఆరోగ్యమే మహా భాగ్యం అని ఆరోగ్య పరీక్షల ద్వారా రోగ నిర్ధారణ అవుతుందని అన్నారు. రోగం వచ్చాక చికిత్స కన్నా రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు జుంబర్తి రాజ్ కుమార్, ప్రశాంత్ రావు, తపస్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్ రావు, రాజేష్, రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు