36 ఏళ్ల అనుబంధానికి అపూర్వ వేడుక
వెంకటాపూర్, నవంబర్ 15 (విజయక్రాంతి): మండలంలోని నల్లగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Nallagunta Zilla Parishad High School) 1990–91 పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం(Alumni Reunion) ఆదివారం రామప్పలో ఘనంగా నిర్వహించారు. 36 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు బాల్య జ్ఞాపకాలను(Friends and childhood memories) నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం రామప్ప గార్డెన్లో ఆత్మీయంగా సమావేశమయ్యారు. చిన్ననాటి ఆటపాటలు, అల్లరి, స్నేహాలను గుర్తుచేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.
కాలం మారినా స్నేహబంధాలు చెరిగిపోవని, ఈ కలయిక జీవితంలో మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ములుగు ఇరిగేషన్ డీఈఈ రాజు, ప్రధానోపాధ్యాయులు ఏకాంబరం, వేణు, రాజయ్య, శ్రీధర్ రెడ్డి, తిరుపతి, శివ, రాము, కుమార్, శ్యామ్, సరిత, రమ, పద్మ, మంజుల, పుష్పమాల, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.