కాంగ్రెస్, బీజేపీపై KTR ఘాటు విమర్శలు
ఆత్మగౌరవం ఎక్కడుంది? రెండు పార్టీల నేతలపై కేటీఆర్ ఘాటు విమర్శలు!
హైదరాబాద్: తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్, బీజేపీ నాయకులు జాతీయ నాయకుల ముందు తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజలు ఇచ్చిన పదవుల్లో కొనసాగుతున్న నేతలు తమ హోదా, గౌరవాన్ని మరిచి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ రెండు జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజల Self Respect విలువ ఎప్పటికీ అర్థం కాదని ఎక్స్ (X) వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీకి బాడీగార్డుల్లా వ్యవహరిస్తున్నారా?
కాంగ్రెస్ నాయకుల తీరును ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు రాహుల్ గాంధీ చుట్టూ బాడీగార్డుల్లా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీ బైక్పై వెళ్తుంటే ఆయన వెనుక మంత్రులు, పార్టీ నేతలు పరుగులు తీస్తున్న దృశ్యాలను ప్రస్తావిస్తూ.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మంత్రులుగా ఉన్నవారు ఇలా వ్యవహరించడం పదవుల Dignityకి తగదని వ్యాఖ్యానించారు.
అమిత్ షా చెప్పులు మోస్తున్నారంటూ బీజేపీపై విమర్శలు
మరోవైపు బీజేపీ నేతలపైనా కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ షా కాళ్లకు నమస్కరించడం, ఆయన చెప్పులు తీసుకెళ్లడం వంటి చర్యలు అత్యంత అవమానకరంగా ఉన్నాయని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, పదవులను గౌరవించుకోవాల్సిన నాయకులే ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని మండిపడ్డారు.
తెలంగాణ ఆత్మగౌరవమే పునాది
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వెనుక ప్రధానంగా Self Respect, ఆత్మగౌరవ భావన ఉన్నాయని కేటీఆర్ గుర్తుచేశారు. అలాంటి రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు జాతీయ నాయకుల ముందు తమ గౌరవాన్ని తగ్గించుకునేలా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారు. జాతీయ పార్టీల రాజకీయ సంస్కృతికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ ఘటనలు బయటపెడుతున్నాయని తన పోస్టులో అభిప్రాయపడ్డారు.