రోజుకో గుడ్డు తింటున్నారా? ఇది తెలుసుకోండి!

15-11-2026 | 06:13pm

రోజుకో గుడ్డు తింటున్నారా? అయితే దాన్ని తీసుకునే విధానంపై కూడా శ్రద్ధ పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుడ్డు (Egg Nutrition) శరీరానికి అవసరమైన పోషకాలను అందించినా.. ఎలా వండుకుని తింటున్నామన్నది కూడా కీలకమని చెబుతున్నారు.

గుడ్డులోని పోషకాలు పొందాలంటే ఉడికించిన గుడ్లకు (Boiled Eggs) ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. నూనెలో ఎక్కువగా వేయించి తినే అలవాటును తగ్గించుకోవాలి. గుడ్డుతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, పీచు పదార్థాలు (Dietary Fiber) అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

గుడ్డు తింటున్నామనే కారణంతో మిగతా ఆహారపు అలవాట్లను నిర్లక్ష్యం చేయకూడదు. శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, రోజూ వ్యాయామం (Daily Exercise) చేయడం కూడా ముఖ్యమే. గుడ్డు తినడం మాత్రమే కాదు.. సమతుల ఆహారంతో సరైన పద్ధతిలో తీసుకున్నప్పుడే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

మరిన్ని వార్తలు