వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలి
భూపాలపల్లి, నవంబర్ 15 (విజయక్రాంతి): జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు(Paddy procurement) కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు(Farmers) దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(Telangana Adivasi Tribal Association) జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్(Polam Rajender) అన్నారు. దళారులు గొలుసు కాంటాలతో ధాన్యం తూకం వేస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర, బోనస్ రైతులకు అందాలంటే వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలు దళారుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం, అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.