గోపిరెడ్డిని పరామర్శించిన రేగా కాంతారావు
15-11-2026 | 06:01pm
అశ్వాపురం, నవంబర్ 15 (విజయక్రాంతి): బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు(Senior BRS leader) సూదిరెడ్డి గోపాలకృష్ణారెడ్డిని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు(Former MLA Rega Kantha Rao) ఆదివారం ఆనందపురంలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవల శస్త్రచికిత్స(Surgery) చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, మణుగూరు, అశ్వాపురం మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.