బ్రిటీషర్లపై అవిశ్రాంత పోరాటం సాగించిన, గిరిజన బిడ్డ బిర్సా ముండా
బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు
కామారెడ్డి, నవంబర్ 15 (విజయక్రాంతి): బ్రిటీషర్లపై అవిశ్రాంత పోరాటం చేసిన చరిత్ర భగవాన్ బిర్సా ముండా ది అని బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులన్నారు. ఆదివారం కామారెడ్డి బిజెపి జిల్లా కార్యాలయంలో భగవాన్ బీర్సా ముండా జయంతి(Birsa Munda Jayanti) వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల కోసం, అస్తిత్వం కోసం, బ్రిటిష్ పాలకుల మత మార్పిడులను ఎదిరించి పోరాడిన గిరిజన విప్లవ వీరుడు, భగవాన్ బిర్సా ముండా అని అన్నారు. ఆయన చూపిన ధైర్యం, తెగువ, పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శం అని అన్నారు. గిరిజనుల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడినీ ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, బిజెపి పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్, విపుల్ జైన్, కుంట లక్ష్మారెడ్డి, శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.