పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

15-11-2026 | 06:11pm

మఠంపల్లి నవంబర్ 15: మండలంలోని విఆర్ఎల్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో 1985-86 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి ఎ&బి సెక్షన్ల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం(Alumni Reunion) ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సుమారు 40 ఏళ్ల నాటి చిన్ననాటి జ్ఞాపకాలను(childhood memories) నేమరువేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఆనందంగా గడిపారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ పాత స్నేహాలను గుర్తు చేసుకున్నారు.ఈ సమ్మేళనంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు(Cultural Programs), వినోదభరితమైన పోటీలు నిర్వహించారు.

విజేతలకు బహుమతులు అందజేసి ఉత్సాహపరిచారు.ఈ కార్యక్రమానికి కొత్త మంగమ్మ,అనూష రవీందర్ రెడ్డి ఆతిథ్యం అందించారు.ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు సమ్మిడి శ్రీనివాస్ రెడ్డి,జోగు శ్రీనివాస్ రెడ్డి,టి.సత్యనారాయణ రెడ్డి, కిష్టిపాటి వెంకటరెడ్డి,జనార్దన్ రెడ్డి,సిస్టర్ ఇన్నాసమ్మ,తెరిస్సా, కరుణాకర్ రెడ్డి,అనంత రెడ్డి, సత్యనారాయణ,కృష్ణారెడ్డి,సంజీవరెడ్డి,రామ్‌నాథ్ తదితరులతో పాటు సుమారు 65 మంది పూర్వ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

చదువుకున్న పాఠశాల రోజులు,చేసిన అల్లరి, గురువులతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఈ సమ్మేళనాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఆత్మీయ పలకరింపులతో సందడి చేశారు.ఇలాంటి సమ్మేళనాలు పాత స్నేహబంధాలను మరింత బలోపేతం చేస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు