యాదాద్రిలో భక్తజన సందడి.. కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం

15-11-2026 | 03:06pm

కార్తీకమాసం, ఆదివారం కావడంతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనం (Temple Darshan) కోసం భక్తులు బారులు తీరగా, వ్రతమండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు (Satyanarayana Swamy Vratam) ఆచరించేందుకు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన భక్తులు ప్రత్యేక పూజలు (Special Pujas) నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు (Crowd Management) చేపట్టి దర్శనాలు, వ్రతాల నిర్వహణకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు