ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

05-11-2026 | 08:08pm

జగిత్యాల, నవంబర్ 05 ( విజయ క్రాంతి ):తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(Telangana Progressive Teachers Federation) సమస్యల సేకరణ, సభ్యత్వంలో భాగంగా జగిత్యాల జిల్లా భీమారం మేడిపల్లి క్యాంపెయిన్ లో భాగంగా జిల్లా అధ్యక్షులు కొక్కుల రామచంద్రం, ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోవర్ధన్, మండల నాయకులు నారాయణ, మనోహర్, సంతోష్, అశోక్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పి ఆర్ సి రిపోర్టు తెప్పించుకొని ఫిట్మెంట్ ప్రకటించి వెంటనే అమలు చేయాలని, అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న అన్ని డీఏలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న పెన్షనర్ల, రెగ్యులర్ ఉపాధ్యాయుల వివిధ బిల్లులు బకాయిలను మంజూరు చేసి ఖాతాలలో జమ చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు