మంత్రులను కొండగట్టుకు ఆహ్వానం

10-11-2026 | 10:19pm

కొడిమ్యాల, నవంబర్ 10 (విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం నందు నిర్వహించనున్న చందనోత్సవం-మహా సంప్రోక్షణ మహోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy), దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ మంత్రి హనుమంతరావులను ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన ఉన్నతాధికారులను కూడా కలిసి ఉత్సవాలకు ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అంజనా రెడ్డి, ప్రధానార్చకులు చిరంజీవ స్వామి, వేద పండితులు పెద్దన్న శర్మ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు