కట్కూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం
బచ్చన్నపేట,(విజయక్రాంతి): మండలంలోని కట్కూర్ గ్రామ సర్పంచ్ బల్ల రవీంద్రనాథ్(Katkur Sarpanch Balla Ravindranath) ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్(Medicity Hospital), ఘనపూర్ వారి సహకారంతో శనివారం కట్కూర్ పాత హైస్కూల్ వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం(Free Mega Medical Camp) నిర్వహించారు. 100 మందికి పైగా ప్రజలు పాల్గొని బీపీ, షుగర్, కంటి, చెవి, ముక్కు, గొంతు, థైరాయిడ్, చర్మ, మోకాళ్లు, నడుము, నరాలు, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలకు పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు.
గుర్తించిన సమస్యల ఆధారంగా 50 మందిని సోమవారం మెడిసిటీ హాస్పిటల్ కు తీసుకెళ్లి ఉచితంగా లేదా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స, ఆపరేషన్లు చేయిస్తామని ప్రతినిధులు తెలిపారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి అంటే రోడ్లు మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.