ఐటిడిఎ ఉట్నూర్ ఉద్యాన నర్సరీ ద్వారా రైతులకు శిక్షణా కార్యక్రమాలు

28-11-2026 | 07:05pm

ఇప్పటికే వివిధ రకాల మొక్కల పెంపకం

ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు కు ప్రాజెక్ట్ అధికారి ఆదేశాలు

ఉట్నూర్ నర్సరీ ని సందర్శించిన ప్రాజెక్ట్ ఉద్యాన అధికారి (PHO) గుడిమళ్ల సందీప్ కుమార్

ఉట్నూర్,(విజయక్రాంతి): ఐటిడిఎ ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు(ITDA Utnoor Project Officer Manda Makarandu) ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ ఉద్యాన అధికారి గుడిమళ్ల సందీప్ కుమార్ ఐటిడిఎ ఉద్యానవన క్షేత్రం(ITDA Horticulture Farm), ఉట్నూర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి సూచనల ప్రకారం ఉద్యానవన క్షేత్రంలో డ్రాగన్ ఫ్రూట్, కూరగాయలు, పుచ్చకాయ, అవకాడో మరియు ఇతర ఉద్యాన పంటలపై ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయాలని సందీప్ కుమార్ సిబ్బందికి సూచించారు. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా, పంటల వైవిధ్యీకరణ వైపు మళ్లేలా అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన క్షేత్రాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

అనంతరం నర్సరీలో పెరుగుతున్న డ్రాగన్ ఫ్రూట్, అవకాడో మొక్కలను పరిశీలించారు. మొక్కల పెరుగుదల, నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రాజెక్ట్ అధికారి ఆదేశాలతో ఇకపై పూర్తి స్థాయిలో రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్షేత్రాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, ప్రదర్శన క్షేత్రాల ఏర్పాటు పనులను వెంటనే ప్రారంభించాలని సిబ్బందిని ఆదేశించారు.

వీబీ-జీ రామ్-జీ పై ప్రత్యక్ష ప్రదర్శనలు

వీబీ-జీ రామ్-జీ (VBG RAM G) పథకం కింద నీటి సంరక్షణ, ఫామ్ పాండ్స్ (వ్యవసాయ కుంటలు), నేల తేమ సంరక్షణ కందకాలు మరియు సూక్ష్మ సేద్యం వంటి అంశాలపై రైతులకు ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని చర్చించారు. ఈ ప్రదర్శనల ద్వారా రైతులకు నీటి యాజమాన్యం, భూసార పరిరక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి క్రాంతి కుమార్, హెచ్ఈఓ  శేఖర్, టెక్నికల్ అసిస్టెంట్ అర్షిత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు