తెలంగాణ సోనియా గాంధీ దయతోనే వచ్చింది

29-11-2026 | 06:35pm

- శివరాజ్ యాదవ్

జనగామ, నవంబర్ 29 (విజయక్రాంతి): జనగామలో(Jangaon) దీక్షా దివస్‌లో హరీష్ రావు(Harish Rao) చేసిన వ్యాఖ్యలను జనగామ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బనుక శివరాజ్(Banuka Shivaraj, former Chairman of the Jangaon Market Committee) యాదవ్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్(BRS) ఒక్కటే పోరాడితే తెలంగాణ రాలేదు. అన్ని పార్టీలు పోరాడితేనే సాధ్యమైంది. సోనియా గాంధీ(Sonia Gandhi) ఇచ్చిన తెలంగాణే ఇది. 1200 అమరవీరుల త్యాగఫలమే మీరు అనుభవిస్తున్న రాజభోగాలు.

కేసీఆర్ కుటుంబం, హరీష్ రావు 9 ఏళ్లలో లక్షల కోట్లు సంపాదించారు. అమరవీరుల కుటుంబాలకు మాత్రం కన్నీళ్లే మిగిల్చారు. దమ్ముంటే జనగామ అంబేద్కర్ సాక్షిగా మీ అక్రమ సంపాదన ఎంతనో చెప్పగలవా? రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట ప్రజలే నీకు రాజకీయ సమాధి కడతారు.

మరిన్ని వార్తలు