చిన్నారుల ప్రతిభకు వేదికగా విద్యా ప్రదర్శన
బచ్పన్ పాఠశాలలో ఘనంగా ఎడ్యుకేషనల్ ఫెయిర్
పటాన్ చెరు/అమీన్ పూర్, నవంబర్ 14 : బీరంగూడలోని(Beeranguda) బచ్పన్ ఏహెచ్పీఎస్ ప్రైమరీ పాఠశాలలో(Bachpan AHPS Primary School) ఎడ్యుకేషనల్ ఫెయిర్(Educational Fair)–2026 ఘనంగా నిర్వహించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు గణితం, ఆంగ్లం, హిందీ, జనరల్ అవేర్నెస్(General Awareness) తదితర అంశాలపై రూపొందించిన వినూత్న ప్రాజెక్టులు, వర్కింగ్ మోడళ్లను(Projects and working models) ప్రదర్శించి ఆకట్టుకున్నారు. చిన్నారులు తమ ప్రాజెక్టులను ఆత్మవిశ్వాసంతో వివరించడం విశేషం.
ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్లు సి.హెచ్. శ్రీనివాసరావు, ఆర్.శిరిషారెడ్డి, జోనల్ అకడమిక్ కోఆర్డినేటర్ హెచ్. ప్రియాంక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. పెద్ద సంఖ్యలో పాల్గొన్న తల్లిదండ్రులు చిన్నారుల ప్రతిభను అభినందించారు. ఆచరణాత్మక విద్యతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.