రైతు కుటుంబాలను గోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

10-11-2026 | 04:17pm

దేశానికి అన్నం పెట్టే రైతుల ఉసురు తగులుతుంది

బీఆర్ఎస్ నేత నైనకంటి ప్రభాకర్‌రెడ్డి

భూపాలపల్లి, (మొగుళ్లపల్లి), నవంబర్ 10 (విజయ క్రాంతి): రైతు బీమా రెన్యూవల్(Farmer Insurance Renewal) చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) రైతు కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తోందని బీఆర్ఎస్ పార్టీ పిడిసిల్ల గ్రామ మాజీ సర్పంచ్ నైనకంటి ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం మొగుళ్లపల్లి మండల(Mogullapalli Mandal) కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

రైతు కుటుంబానికి అండగా ఉండేందుకు గత ప్రభుత్వం రూ.5 లక్షల రైతు బీమా పథకాన్ని(Farmers' Insurance Scheme) అమలు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం బీమాను రెన్యూవల్ చేయకపోవడం వల్ల ఆగస్టు 14 తర్వాత మరణించిన రైతుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. రైతు బీమా విషయంలో ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు.

రైతు బంధు అమలు చేయకపోవడం, పంటలకు విద్యుత్, బోనస్ విషయంలో స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఆగస్టు 14 తర్వాత మరణించిన ప్రతి రైతు కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లించి, రైతు బీమాను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు