యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలి
నాగిరెడ్డిపేట్,నవంబర్ 10 (విజయక్రాంతి): మండలములోని గోలిలింగాల గ్రామం(Golilingala Village) వడ్ల మార్కేట్లో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రశాంత్ కుమార్(Agricultural Extension Officer Prashanth Kumar) రైతులకు ఎల్నినో(El Niño) గురించి వివరించి ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో రైతులు యాసంగి పంట(Farmers' Rabi (Yasangi) crop) ప్రణాళికలో బాగంగా ఆరుతడి పంటలు సాగు(Cultivation of semi-dry),కూరగాయల సాగు వైపు వెళ్లాలని రైతులకు సూచించడం జరిగింది. రైతులు యాసంగి పంటలో(Farmers' Rabi (Yasangi) crop) భాగంగా ఈ ఎల్నినో వలన బోరు బావులు ఎంత వరకు పంటకు నీలు అందిస్తాయి అనేది ఆలోచన చేసుకుని పంట వేయాలని రైతులకు సూచించడం జరిగింది.
వరి పంట మాత్రమే వేయకుండా ఆరుతడి పంటలు వేసి ఒకే నేలలో 4 నుండి 5 రకాల పంటల వరకు సాగు చేయవచ్చని తద్వారా ఒకే నేలలో తక్కువ కాలంలో ఎక్కువ పంటలు పండించడమే కాకుండా నేల సారవంతం అయి వానకాలం పంటలో అధిక దిగుబడి సాధించవచ్చని రైతులకు వివరించడం జరిగింది,అదే విధంగా అంతర పంటల సాగు వలన ప్రధాన పంటలో కలుపు ఉధృతి తగ్గుతుంది. అదే విధంగా తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులు సాధించవచ్చని సూచించడం జరిగింది.
వానకాలం పంట ఆవేశాలు కాల్చివేయకుండా నేలలో కుళ్లిపోయేలా చేసుకోవాలని,కాల బెట్టడం వలన నేల ఆరోగ్యం దెబ్బతిని సూక్ష్మపోషక లోపాలు వస్తాయని తద్వారా పంట దిగుబడి తగ్గుతుందని రైతులకు చెప్పడం జరిగింది.ఎవరైతే రైతులు సొసైటీకి వడ్లు కాంట చేయాలనుకుంటున్నారో ఆ రైతులు కచ్చితంగా వడ్లని తూర్పార పట్టాలని తూర్పార పట్టిన వడ్లను మాత్రమే కొనుగోలు చేస్తారని రైతులకు చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రజిత,రైతులు పాల్గొన్నారు.