హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి అటవీ అధికారుల పరిశీలన
10-11-2026 | 03:41pm
వాంకిడి (విజయక్రాంతి): బంబార గ్రామపంచాయతీ(Bambara Gram Panchayat) పరిధిలోని గోండు కోసర గ్రామానికి వెళ్లే మార్గంలోని వాగుపై హై లెవెల్ బ్రిడ్జి(High-Level Bridge) నిర్మాణానికి సంబంధించి అటవీ అధికారులు(Forest officials) క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన అటవీ భూమి(Forest land) వివరాలను ఎఫ్ఆర్ఓ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెండారే కృష్ణాజీ, మాజీ ఉపసర్పంచ్ బొహిరే ప్రకాష్, ఫారెస్ట్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.