ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం

10-11-2026 | 04:19pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జాతీయ న్యాయ సేవల దినోత్సవం(National Legal Services Day) సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(District Legal Services Authority) (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి జి. అనూష(G. Anusha) మంగళవారం ఆసిఫాబాద్‌లోని(Asifabad) ప్రత్యేక సబ్‌జైలును సందర్శించారు. ఈ సందర్భంగా రిమాండ్, విచారణ ఖైదీలకు(Prisoners on remand or awaiting trial) ఉచిత న్యాయ సహాయం, చట్టపరమైన హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమన్నారు. ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అర్హులైన ఖైదీలు చట్ట ప్రకారం బెయిల్ పొందే హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఖైదీలు జైలు నిబంధనలు పాటిస్తూ, మంచి ప్రవర్తనతో జీవితంలో మార్పు తెచ్చుకొని సమాజంలో మంచి పౌరులుగా తిరిగి అడుగుపెట్టాలని అన్నారు.అనంతరం జైలు వంటగది, పరిశుభ్రత, ఖైదీలకు అందిస్తున్న ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్, డీఎల్‌ఎస్‌ఏ, జైలు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు