మహిళలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

10-11-2026 | 04:12pm

డిసిసి ఉపాధ్యక్షులు రాజుర సత్యం 

ఖానాపూర్ (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో మహిళా అభివృద్ధి(Women's Development) ధ్యేయంగా, మహిళలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) పని చేస్తుందని 11వ వార్డు కౌన్సిలర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాజుర సత్యం అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ మున్సిపాలిటీ పదకొండవ వార్డులోని రాజీవ్ నగర్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో మెప్మా వివో మహిళా సంఘం గ్రూప్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ప్రజా ప్రభుత్వంలో అన్ని విజయాలతో ముందుకు నడుస్తున్నారని, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ సహకారాలతో మహిళా సంఘాలకు గ్రూపులకు అధిక రుణాలు ఇప్పించడానికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. సమావేశంలో మెప్మా కోఆర్డినేటర్ స్రవంతి ,సిబ్బంది రామలక్ష్మి, నారాయణ, గ్రూప్ మహిళలు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు