విద్యార్థులకు కంటి పరీక్షలు
దృష్టి లోపాల గుర్తింపు.. అవసరమైన వారికి కళ్లద్దాల సూచన
దోమకొండ, నవంబర్ 10 (విజయక్రాంతి): దోమకొండ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో(Domakonda Zilla Parishad Boys High School) మంగళవారం విద్యార్థులకు(Students') ప్రత్యేక కంటి పరీక్షలు(Eye examinations) నిర్వహించారు. ఆటో రిఫ్రాక్టోమీటర్ యంత్రం(Auto-refractometer machine) ద్వారా విద్యార్థుల కళ్లను పరీక్షించి దృష్టి లోపాలను గుర్తించారు. కంటి సమస్యలు ఉన్న విద్యార్థులను గుర్తించి, అవసరమైన వారికి కళ్లద్దాలు ఉపయోగించాలని నేత్ర వైద్య సిబ్బంది సూచించారు.
ఈ కార్యక్రమాన్ని దోమకొండ ఉప జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయానికి చెందిన నేత్ర వైద్యాధికారి రవీందర్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భీమ్ ,ఆశా కార్యకర్తలు పాల్గొని సహకరించారు.