రంగనాయక స్వామి ఆలయంలో కార్తీక దీపారాధన
నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు ప్రతిరోజూ ఆకాశదీపోత్సవం
శ్రీరంగాపూర్, నవంబర్ 10: వనపర్తి శ్రీరంగాపురం మండల(Vanaparthi Srirangapuram Mandal) కేంద్రంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ రంగనాయక స్వామి దేవస్థానంలో(Sri Ranganayaka Swamy Temple) కార్తీక మాసం సందర్భంగా ఆకాశదీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. కార్తీక మాస ఆధ్యాత్మిక శోభను చాటుతూ నవంబర్ 10, 2026 నుంచి డిసెంబర్ 8, 2026 వరకు ప్రతిరోజూ సాయంత్రం సంధ్యా సమయంలో ఆకాశదీపోత్సవం నిర్వహించనున్నారు.
భక్తులు(Devotees) ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.ఆకాశదీపోత్సవంలో పాల్గొనదలచిన భక్తులు ప్రతిరోజూ సాయంత్రం 6:30 గంటలకు ఆలయానికి చేరుకోవాలని ఆలయ నిర్వాహకులు సూచించారు. కార్తీక మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యత ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.