కేటీపీపీలో విషాదం..
18-11-2026 | 02:52pm
గణపురం, నవంబర్ 18 (విజయ క్రాంతి): మండలంలోని చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు(Kakatiya Thermal Power Project) (కేటీపీపీ) ప్రాంగణంలో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రాజెక్టులో ఆర్టిజన్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న లింగంపల్లి శ్రీనివాసరావును బొలెరో వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదంతో ప్రాజెక్టు ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాద వివరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.