బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
బోర్లం క్యాంప్ గ్రామ కార్యదర్శి రహేలా
బాన్సువాడ, నవంబర్ 14 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్ గురుకుల పాఠశాలలో(Borlam Camp Residential School) బాలల దినోత్సవాన్ని(Childrens Day) పురస్కరించుకుని శనివారం బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా బోర్లం క్యాంప్ గ్రామ కార్యదర్శి రహేలా ప్రతిజ్ఞ చేయించారు.
బాల్య వివాహాల వల్ల బాలికల భవిష్యత్తుపై పడే ప్రభావం, విద్యకు కలిగే ఆటంకాలు, బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని, బాలికల విద్యను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంటోల్ల నరసవ్వ, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల అధ్యక్షురాళ్లు, వీవోఏలు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.