ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగొద్దు

21-11-2026 | 09:47pm

పీపీసీ, పీఎస్ఎస్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

దోమకొండ, నవంబర్ 21 (విజయక్రాంతి): దోమకొండ మండల(Domakonda Mandal) కేంద్రంలోని పీపీసీ, పీఎస్ఎస్ ధాన్యం కొనుగోలు(PSS Paddy Procurement) కేంద్రాలను శనివారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) సందర్శించి క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన స్థానిక రైతుతో నేరుగా మాట్లాడి ధాన్యం సేకరణ, ఎదురవుతున్న ఇబ్బందులపై వివరాలు సేకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కొనుగోళ్లలో పారదర్శకత పాటిస్తూ, నాణ్యతా ప్రమాణాల ప్రకారం ధాన్యాన్ని సేకరించాలని సూచించారు. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, కొనుగోలు ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలన్నారు.

అనంతరం ఎంపీడీవోతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై(Indiramma Family Life Insurance Scheme) సమీక్షించారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఎన్ని గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన కుటుంబాలకు పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీసీఎస్ఓ వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్, తహసీల్దార్ సప్న, ఎంపీడీవో మధురిమ,సివిల్ సప్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కిష్టయ్యతో పాటు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు