అలుగునూరు.. తెలంగాణ దీక్షకు చారిత్రక వేదిక!

21-11-2026 | 10:00pm

దీక్షా దివస్‌ను పవిత్ర దినంగా నిర్వహిస్తాం

తెలంగాణ ఉద్యమ చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది

సభకు వేలాదిగా తరలిరావాలి.. కేటీఆర్‌ను ఆహ్వానిస్తున్నాం : గంగుల కమలాకర్

కరీంనగర్, నవంబర్ 29(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన పవిత్రమైన రోజని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(Gangula Kamalakar) పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్(KCR) చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందని, ఆ చారిత్రాత్మక ఘట్టానికి వేదికైన అలుగునూరులో ఈనెల 29న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా శనివారం అలుగునూరులో దీక్షా దివస్ సభ నిర్వహించనున్న ప్రదేశాన్ని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితర నాయకులతో కలిసి గంగుల కమలాకర్ పరిశీలించారు. సభ ఏర్పాట్లపై చర్చించి, అనంతరం మీడియాతో మాట్లాడారు.

2009 నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరడం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక సంచలన ఘట్టమని గంగుల కమలాకర్ గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందని విమర్శించారు.

1969లో తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండా మోసం చేసిన కాంగ్రెస్, మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందనే ఆవేదనతో కేసీఆర్ నిరాహార దీక్షకు పూనుకున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమై కేసీఆర్ దీక్షకు బయలుదేరారని పేర్కొన్నారు.

అలుగునూరు అరెస్టుతో ఉద్యమం మలుపు

కేసీఆర్ దీక్షకు బయలుదేరిన క్రమంలో అలుగునూరు ప్రాంతంలో ఆయనను అరెస్టు చేయడం తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిందని గంగుల కమలాకర్ అన్నారు. కేసీఆర్ అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు, యువత, ఉద్యమకారులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి ఉద్యమించడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించక తప్పలేదని పేర్కొన్నారు. ప్రజల ఉద్యమ ఒత్తిడితోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కేంద్రం ప్రకటన చేసిందని, ఆనాడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయ్యేది కాదని అభిప్రాయపడ్డారు.

పార్టీ కార్యక్రమం కాదు.. తెలంగాణ ప్రజల చారిత్రక దినం

దీక్షా దివస్ అనేది కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం మాత్రమే కాదని, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన చారిత్రాత్మక దినమని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాయని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, ఉద్యమంలో ఎందరో చేసిన త్యాగాలు, తెలంగాణ సాధన వెనుక ఉన్న చరిత్రను నేటి చిన్నారులకు, భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను మరచిపోకుండా, దాని స్ఫూర్తిని తరతరాలకు అందించాలనే సంకల్పంతో దీక్షా దివస్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు.

గాలి ఉన్నంతకాలం దీక్షా దివస్ నిర్వహిస్తాం

తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం, ఈ గడ్డపై గాలి ఉన్నంతకాలం దీక్షా దివస్ కార్యక్రమాన్ని పవిత్ర దినంగా, ఘనంగా నిర్వహిస్తామని గంగుల కమలాకర్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో అలుగునూరుకు ప్రత్యేకమైన స్థానం ఉందని, కేసీఆర్ దీక్షకు బయలుదేరిన ఈ ప్రాంతాన్ని ఉద్యమ పవిత్ర స్థలంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ నెల 29న అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ సభను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

దీక్షా దివస్ సభకు కవులు, కళాకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఉద్యమకారులు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని గంగుల కమలాకర్ తెలిపారు. ఈ సభ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకే పరిమితం కాదని, తెలంగాణ రాష్ట్ర చరిత్రను గౌరవించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటుతూ, దీక్షా దివస్ ప్రాధాన్యతను మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లేలా వేలాది మంది సభకు హాజరుకావాలని కోరారు.

కేటీఆర్ రాకకు ఆహ్వానం.. సభకు భారీ ఏర్పాట్లు

దీక్షా దివస్ సభకు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆహ్వానిస్తున్నామని గంగుల కమలాకర్ తెలిపారు. కేటీఆర్ హాజరయ్యే నేపథ్యంలో సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో పా…

మరిన్ని వార్తలు