ఉదయం నుంచి రాత్రి వరకు... రైల్వే స్టేషన్లలో కొనసాగిన తనిఖీలు
21-11-2026 | 09:58pm
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) పరిధిలోని మహబూబాబాద్, కేసముద్రం, డోర్నకల్ రైల్వే స్టేషన్లలో అనుమానస్పదంగా సంచరించే వ్యక్తుల కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేకంగా మహబూబాబాద్ జిల్లా పోలీసులు శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల బ్యాగులను తనిఖీ చేశారు. ముఖ్యంగా గంజాయి, మాదకద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి తరచుగా ఇలాంటి తనిఖీలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు శనివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.