ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన డీఆర్డీఓ

10-11-2026 | 10:49pm

భిక్కనూర్, నవంబర్ 10 (విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి, కంచర్ల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఆర్డీఓ దామోదర్ రెడ్డి(DRDO Damodar Reddy) మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. కంచర్లలో ధాన్యం శుభ్రం చేసిన రైతులతో మాట్లాడారు.

జీపీఎస్ ఉన్న వాహనాల్లో, కేటాయించిన గోదాములకే ధాన్యాన్ని తరలించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రికార్డులు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏ పి ఏం సాయిలుతో పాటు పలువురు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు