కొరివి వీరన్న ఆలయంలో కోతుల బీభత్సం
భక్తులకు కోతుల బెడద
మహబూబాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad District) ప్రసిద్ధిగాంచిన కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా కోతులు గుంపులుగా సంచరిస్తున్నాయి. మంగళవారం ఆలయంలో కూర్చున్న ఓ భక్తురాలిపై కోతి దాడి చేయడంతో భక్తులు(devotee) తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కార్తీక మాసం కావడంతో రోజురోజుకూ ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది.స్వామివారి అమ్మవారి దర్శనం కోసం వస్తే కోతుల దాడులతో భక్తులు(devotee) బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భక్తురాలిపై కోతి దాడి చేయడంతో అప్రమత్తమైన పోలీసులు కోతులను చెదరగొట్టి భక్తులకు(devotee) రక్షణ కల్పించారు. కోరిన కోరికలు తీర్చే కురవి వీరభద్రస్వామి దర్శనానికి వస్తున్న భక్తులకు కోతుల బెడద తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల దాడులతో భక్తులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆలయ అధికారులు, అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి కోతుల బెడదను నియంత్రించాలని భక్తుల విజ్ఞప్తి చేస్తున్నారు.