ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి

10-11-2026 | 03:26pm

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ నవంబర్ 10విజయక్రాంతి : ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని, అభివృద్ధి పనులను(development works) నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(Uppal MLA Bandari Lakshma Reddy) ఆదేశించారు. కాప్రా మున్సిపల్ కార్యాలయంలో(Kapra Municipal Office) ఉప్పల్ నియోజకవర్గ(Uppal Constituency) పరిధిలోని మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, దోమల నివారణ, పట్టణ ప్రణాళిక, ఆహార భద్రత తదితర అంశాలపై చర్చించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో వివిధ బస్తీల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు తమ ప్రాంతాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి బస్తీకి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.సమావేశంలో ఉప్పల్, నాచారం, కాప్రా డిప్యూటీ కమిషనర్లు ఆనంద్, నిత్యానంద్, రవీందర్ సాగర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు