21లోగా ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలి
అదనపు కలెక్టర్ విక్టర్
కామారెడ్డి, నవంబర్ 10 (విజయక్రాంతి): అర్హులైన ఓటర్లు(Eligible voters) ఈనెల 21 లోగా దరఖాస్తు(Application) చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్(District Additional Collector Victor) కోరారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో(Draft electoral roll) పేర్లు లేని వారికి తుది జాబితాలో పేరు చేర్చుకునేందుకు మరోక సారి అవకాశం కల్పించినట్లు తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల(political parties) ప్రతినిధులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఎన్యూమరేషన్ ఫారాలు(Enumeration forms) జారీ చేసినప్పటికీ గైర్హాజరు కావడం, నివాసం మారడం తదితర కారణాలతో ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులైన ఓటర్లకు తుది ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చుకునేందుకు భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని తెలిపారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్హులైన ఓటర్లు తమ పేర్లను తుది ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు), సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్ఓలు), ఎన్నికల నమోదు అధికారులను (ఈఆర్ఓలు) సంప్రదించి నిర్దేశించిన విధానంలో ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించాలని సూచించారు.
ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా ఎన్నికల సంఘం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరి, ఎన్నికల సూపరింటెండెంట్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.