యాసంగిలో తక్కువ నీటి ఉపయోగ పంటలే శ్రేయస్కారం
రుద్రంగి రైతు వేదిక లో ఎల్నినో ప్రభావం,పంటల రక్షణపై అవగాహన కార్యక్రమం
రుద్రంగి నవంబర్ 10(విజయక్రాంతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) రుద్రంగి మండలంలోని రైతు వేదికలో వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం,కేట్ బచావో (పంటల సంరక్షణ) మరియు యాసంగి పంట మార్పిడిపై రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు మాట్లాడుతూ,నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని అధిక నీటి అవసరమున్న పంటల సాగుపై పునరాలోచించాలని రైతులకు సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా పసుపు, వెల్లుల్లి, మిరప, ధనియాలు వంటి పంటల సాగు యాజమాన్య పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల ఎంపిక మరియు నీటి సమర్థవంతమైన వినియోగంపై రైతులకు సమగ్రంగా వివరించారు.
ఈ సమావేశానికి మండల్ ప్రత్యేక అధికారి ఎంపిడిఓ నటరాజ్,ఎం.ఏ.ఓ సాయి కిరణ్,ఎం.ఆర్.ఓ పుష్పలత,ఏ.ఈ.ఓ జ్యోతి అధికారులు పాల్గొన్నారు.అలాగే ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి ,గ్రామ సర్పంచ్ గండి నారాయణ తదితరులు హాజరయ్యారు.రైతు వేదికలో సమావేశం ముగిసిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ప్రగతిశీల రైతు సుమంతు రాజిరెడ్డి పొలాన్ని ఎంఏఓ ఫీల్డ్ విజిట్ చేశారు. ఈ ఫీల్డ్ విజిట్లో ఎంఏఓతో పాటు ఏఈఓలు పాల్గొని పంటల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి, రైతుకు తగిన సలహాలు, సూచనలు అందించారు.