ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు
తాడ్వాయి,నవంబర్,15( విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు(Indiramma House) అందించి ఆవాసం ఏర్పాటు చేస్తుందని ఇందిరమ్మ కమిటీ గ్రామ ఇన్చార్జ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పైడి రాజేశ్వర్ రెడ్డి(Paidi Rajeshwar Reddy) తెలిపారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో నిరుపేద అయిన వార్డు సభ్యులు గైని రాజుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందని తెలిపారు. ఆయన నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటికి ఆదివారం గృహప్రవేశం నిర్వహించినట్లు తెలిపారు.
గ్రామాలలో ఎంతమంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్న అందరికీ ప్రభుత్వం ఇల్లు అందించి ఆదుకుంటుందని తెలిపారు.లబ్ధిదారుడికిఆయన నూతన వస్త్రాలు అందించారు. లబ్ధిదారుడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావుకు(Yellareddy MLA K. Madan Mohan Rao) ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజగౌడు, బ్రాహ్మణపల్లి కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు తూర్పు రాజేంద్రప్రసాద్, నాయకులు భోగ నరేందర్, అంబీర్ వరుణ్ రావు, రజనీకాంత్, మరాటి రమేష్,నరోజ్ తదితరులు పాల్గొన్నారు.