నాలుగు పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు..

10-11-2026 | 10:39pm

22 మంది అరెస్ట్, రూ. 37 వేల 252 నగదు స్వాధీనం..

12 సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాల స్వాధీనం..

నాగిరెడ్డిపేట్, నవంబర్ 10 (విజయక్రాంతి): దీపావళి సందర్భంగా పేకాట ఆడుతున్న స్థావరాలపై మెరుపు దాడులు చేపట్టి 22 మందిని అరెస్టు చేసి రూ.37, 250 నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై అగస్త్య భార్గవ్ గౌడ్(Sub-Inspector Agastya Bhargav Goud) అన్నారు. సోమవారం రాత్రి నమ్మదగిన సమాచారం మేరకు మండల కేంద్రం గోపాల్ పెట్లోని సుభాష్ చంద్రబోస్ కాలనీలో.. పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో వెళ్లి పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.

అలాగే తాండూర్ గ్రామంలో.. పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందడంతో చాకచక్యంగా వ్యవహరించి రాష్ట్రంగా ఒక ఇంట్లో పేకాట ఆడుతున్న అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. జలాల్పూర్ గ్రామంలో పేకాట సావరంపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకొనివారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

టేకుల చెరువు తండా శివారులో పేకాట ఆడుతున్న సవరంపై దాడి చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వారి వద్ద లభించిన నగదు, సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ తరలించినట్లు చెప్పారు. కుటుంబాలను ఆర్థికంగా తీవ్రంగా నష్టపరిచే.. ప్రభుత్వ నిషేధిత పేకాటను చట్ట విరుద్ధంగా.. ప్రవర్తిస్తూ పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై భార్గవ్ గౌడ్ హెచ్చరించారు. వారి వెంట పోలీస్ కానిస్టేబుల్ దక్షిణామూర్తి, సురేష్ గౌడ్, తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు