బాన్సువాడ టూ శబరిమలకు మహా పాదయాత్ర ప్రారంభం

05-11-2026 | 03:28pm

జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం...

బాన్సువాడ, నవంబర్ 5 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం నుంచి పవిత్ర శబరిమల పుణ్యక్షేత్రానికి చేపట్టిన ‘సువర్ణ భూమి శబరిమల మహా పాదయాత్ర’(Sabarimala Grand Pilgrimage) భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా ప్రారంభమైంది.ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో(Sri Ayyappa Swamy Temple) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం శబరిమల క్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాముల యాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జెండా ఊపి పాదయాత్రను లాంఛనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు,

అయ్యప్ప గురుస్వాములు, స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పాదయాత్రకు ఘనంగా వీడ్కోలు పలికారు. భక్తి, ఆధ్యాత్మికతల నడుమ ప్రారంభమైన ఈ మహా పాదయాత్ర విజయవంతంగా సాగాలని ఎమ్మెల్యే పోచారం, కాసుల బాలరాజ్ భక్తులు ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు